YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీ ప్రభుత్వం లోనే మైనారిటీ ల అభివృద్ధి : ఖలీఫతుల్లా

మోడీ ప్రభుత్వం లోనే మైనారిటీ ల అభివృద్ధి : ఖలీఫతుల్లా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాల్లో కీలక మైనారిటీ నేతగా పేరొందిన ముస్లిం పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫతుల్లాతో భేటీ అయ్యారు. బుధవారం   ఉదయం  అబ్దుల్ సత్తార్ తన పార్టీ ఎంపీ అభ్యర్థులు జమాల్ బాష, మహ్మద్ రఫీ,నాయకులు నాగేశ్వరరెడ్డి, మల్లేష్ తదితరులతో కలిసి ఒంగోలులో బీజేపీ నేత ఖలీఫాతుల్లాహ్ తో సమావేశమయ్యారు. త్వరలో తన అనుచరులతో కలిసి బీజేపీ లో చేరే అంశంపై  చర్చించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లో దేశంలో ని మైనారిటీ ల శాశ్వత సమస్యల కు పరిష్కారం లభిస్తోందని ఖలీఫాతుల్లా చెప్పారు. ముస్లిం లందరూ బీజేపీలో చేరి దేశాభివృద్ధి కి, మైనారిటీ ల అభ్యున్నతికి పాల్పడాలని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు రాజకీయంగా, సామాజికంగా,ఆర్ధికంగా ఎంతో వెనుకబడ్డారనిఅబ్దుల్ సత్తార్ జీ ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని కొంతైనా అధిగమించేందుకుదేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలు అధికారంలోఉన్న పాలక పార్టీల్లో చేరి తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సత్తార్ జీ పిలుపునిచ్చారు.మైనారిటీ ల రాజకీయ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసమే తాను త్వరలో బీజేపీలో చేరున్నానని ఆయన
వెల్లడించారు.మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం అందని ద్రాక్ష లాగే ఉందని, దీన్ని అధిగమించేందుకు మోడీ నాయకత్వం లోని బీజేపీ లో ముస్లిం లందరూ స్వచ్చందంగా చేరి దేశాభివృద్ధి కి, ముస్లిం మైనారిటీల అభివృద్ధి కి పాటుపడాలని అబ్దుల్ సత్తార్ కోరారు.త్వరలోనే బీజేపీ కేంద్ర,రాష్ట్ర నాయకుల సమక్షంలో ఘనంగా తమ వర్గం చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, తమచేరికను సాదరంగా ఆహ్వానించిన కర్నూలులోని బీజేపీ సీనియర్ నేత కపీలేశ్వరయ్యను అబ్దుల్ సత్తార్ ధన్యవాదాలు తెలిపారు.

Related Posts