Highlights
- తీరానికి కోట్టుకువచ్చిన డాల్ఫిన్ కళేబరం
- 1 .20 క్వింటాళ్ల బరువు గల డాల్పిన్
కనకదుర్గ సముద్ర తీరానికి జల చరాశుల కళేబరాలు కొట్టుకువస్తున్నాయి. నెల రోజుల కిందట ఒక డాల్ఫిన్, పలు తాబేళ్లు కళేబరాలు కొట్టుకొచ్చాయి.ఈ క్రమంలో ఓ డాల్పిన్ కళేబరం కొట్టుకువచ్చింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని వెలుగు చూసింది. అక్కడి కనకదుర్గ సముద్ర తీరానికి సుమారు 1.20 క్వింటాల బరువు గల డాల్పిన్ కొట్టుకువచ్చింది. దీనిపై మత్స్యశాఖ సహాయ సంచాలకుడు కె.రమణకుమార్ మాట్లాడుతూ.. డాల్ఫిన్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మర బోట్ల కారణంగా గాయాలపాలైనా, సముద్రజలాల్లోకి కలుషిత జలాలు కలిసినా తట్టుకోలేవని చెప్పారు. అందుకే ఇవి మృతి చెంది ఉంటాయన్నారు.