YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

గత రెండు సెషన్ల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్ మంగళవారం పరుగులు పెట్టింది. ఉదయం నష్టాల్లో ట్రేడయిన బెంచ్‌మార్క్ సూచీలు తర్వాత కోలుకొని చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 39,435 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,796 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ షేర్ల ర్యాలీ కలిసొచ్చింది.
మార్కెట్ హైలైట్స్..

✺ నిఫ్టీ 50లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ దాదాపు 3 శాతం పెరిగింది.

✺ అదేసమయంలో యస్ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ షేరు 2 శాతానికి పైగా పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా ర్యాలీ చేశాయి.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.69 శాతం తగ్గుదలతో 63.75 డాలర్లకు తగ్గింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.54 శాతం తగ్గుదలతో 57.59 డాలర్లకు దిగొచ్చింది.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు నిలకడగానే ట్రేడవుతోంది. 69.36 వద్ద ఉంది.

Related Posts