YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ రంగంపై సమీక్ష విచారణకు మంత్రివర్గ ఉపసంఘం

విద్యుత్ రంగంపై సమీక్ష విచారణకు మంత్రివర్గ ఉపసంఘం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గత ప్రభుత్వ అవినీతి బాగోతాలపై కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు, 30 అంశాలపై విచారణ చేస్తామని సీఎం వైయస్ జగన్ వెల్లడించారు. ఇందుకు ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ సంస్థల సహకారంతీసుకుంటామని అన్నారు. బుధవారం జరిగిన విద్యుత్రంగ సమీక్షా సమావేశంలో అయన మాట్లాడారు. కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు, సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లపై విస్తృత చర్చ జరిగింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని అయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని రివ్యూలో వెల్లడి అయినట్లు సమాచారం. ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు, సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. సోలార్, విండ్ కంపెనీల్లో ఒప్పందాల్లో భారీ దోపిడీ స్పష్టం అవుతున్న మీదట  ఈ ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారి, అప్పటి మంత్రి, అప్పటి ముఖ్యమంత్రిపైనా న్యాయపరమైన చర్యలకు ఆదేశించారు.

Related Posts