YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటర్లను నిందించడం తప్పు : మోడీ

ఓటర్లను నిందించడం తప్పు  : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని పరోక్ష విమర్శలు సంధించారు. కొందరు విపక్షనేతలు ఇటీవల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తమ ఓటమికి ఓటర్లను నిందిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని హితవు పలికారు. అహంకారానికీ ఓ హద్దుంటుందని, ఓటర్లను తక్కువచేసి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దేశప్రజలు ఓడిపోయినట్టుగా ప్రచారం జరుగుతోందని, రాహుల్ ఓడినంత మాత్రాన ప్రజాస్వామ్యం ఓడినట్టు కాదని మోదీ స్పష్టం చేశారు.వ‌య‌నాడ్‌లో భార‌త్ ఓడిపోయిందా ? లేక రాయ్‌బ‌రేలీ ఓడిందా ? తిరువ‌నంత‌పురంలో ఓట‌మిపాలైందా ? మ‌రి అమేథీలో ఏం జ‌రిగింది ? ఇవేం వాద‌న‌లు ? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. ఇక దేశ‌మే ఓడిన‌ట్టా ! ఆవేశానికి కూడా హ‌ద్దులు ఉంటాయి. 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేద‌ని ప్ర‌ధాని మోదీ ఆ పార్టీపై ఫైర్ అయ్యారు.రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు ఎన్నిక‌ల్లో గెలిచాయి, కానీ దేశం ఓడిపోయింద‌ని, ప్ర‌జాస్వామ్యం ఓట‌మిపాలైంద‌ని కొంద‌రు అన‌డం బాధ‌కు గురిచేస్తోంద‌న్నారు. అలాంటి ప్ర‌క‌ట‌న‌లు నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఓట‌ర్ల నిర్ణ‌యాన్ని ఎందుకు ప్ర‌శ్నిస్తున్నార‌ని మోదీ అన్నారు. స‌మ్మాన్ నిధి స్కీమ్ కోసం రైతులు అమ్ముడుపోయారంటున్నారు. ఇది నిజంగా షాక్‌కు గుర‌య్యే అంశ‌మే, ఇందులో మీడియాను కూడా త‌ప్పుప‌డుతున్నారు, మీడియా వ‌ల్లే బీజేపీ ఎన్నిక‌లు నెగ్గిందంటున్నారు, అంటే మీడియా అమ్మ‌కానికి ఉందా, ఇదే లాజిక్ త‌మిళ‌నాడు, కేర‌ళ‌కు వ‌ర్తిస్తుందా అని మోదీ ప్ర‌శ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలు నిర్ణయాత్మక, నవభారతానికి ఓటువేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఓల్డ్ ఇండియా అనే ఆలోచనను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు జార్ఖండ్ రాష్ట్రంలో తబ్రేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిని కొందరు దుండగులు కొట్టి చంపడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘అధ్యక్షా.. జార్ఖండ్ లో జరిగిన మూకహత్యలో యువకుడు ప్రాణాలు కోల్పోవడం నిజంగా విచారకరం. ఈ విషయంలో నాతో పాటు ఈ సభలో ఉన్న అందరూ బాధపడుతున్నారు. ఈ ఘటనలో దోషులకు కఠినమైన శిక్షలు పడాలి. కానీ ప్రతిపక్ష నేత ఒకరు(గులాం నబీ ఆజాద్) జార్ఖండ్ ను మూకహత్యల ఫ్యాక్టరీగా అభివర్ణించారు. ఓ రాష్ట్రాన్ని ఇలా దోషిగా నిలబెట్టడం సరైనదేనా? అక్కడా మంచివాళ్లు, సామాన్యులు ఉన్నారు. జార్ఖండ్ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసే హక్కు మనలో ఎవరికీ లేదు’ అని చెప్పారు. భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Related Posts