యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఆగస్టులో టీమిండియాతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని గేల్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన నిర్ణయాన్ని మార్చుకుని... ఇండియాతో సిరీస్ తర్వాత తప్పుకుంటానని తాజాగా వెల్లడించాడు. 1999లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గేల్... టీమిండియాతోనే చివరి మ్యాచ్ ఆడబోతుండటం గమనార్హం.