టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు ట్వీట్టర్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘటుగా విమర్శలు గుప్పించారు. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదు సారని అన్నారు. మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదని అన్నారు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది. పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల...కల గానే మిగిలిపోతుందని అన్నారు.