యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ప్రముఖ నటి, దర్శకురాలు, గిన్నిస్బుక్ అవార్డ్ గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల మృతి పట్ల హీరో కృష్ణ మహేష్ అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మినిశివ థియేటర్ లో గురువారం అభిమానులు ఏర్పాటు చేసిన సంతాప సభలో ముందుగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి కలిగేలా రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అభిమానుల అధ్యక్షుడు వహాబ్, థియేటర్ యజమాని వంశీరెడ్డి లు మాట్లాడుతూ..అమ్మాయిలకు సినిమాలెందుకు? అన్నచోట నటిగా, కథానాయికగా, దర్శకురాలిగా రాజ్యమేలారన్నారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది మహిళలకు మార్గదర్శకంగా నిలిచారన్నారు. గత రెండు దశాబ్దాలుగా హీరో కృష్ణను కాని, విజయనిర్మలని కానీ ఒంటరిగా చూసిన వారెవరు లేరన్నారు. ఒకరి ఆసరాతో మరొకరు ఉండేవారన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పరమేష్, ఎటిఎం శ్రీనివాసులు, వడ్డే శ్రీనివాసులు, ఆనంద్, నాగరాజు, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.