యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రకాశం జిల్లా అద్దంకి గుండ్లకమ్మ నది పరిహార ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను అద్దంకి ఎస్సై శ్రీనివాస రావు సీజ్ చేశారు.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకుని రీచ్ లో ఇసుక నింపుతుండగా పట్టుకున్నారు... ప్రభుత్వ అనుమతితో కొత్త పాలసీ విధానం వచ్చిన దాకా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమంగా తరిలి పోవడంతో గుండ్లకమ్మ కాస్త గుంతల మయం గా మారింది.. దీంతో అద్దంకిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.