యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని తన ట్వీట్లో పేర్కొన్నారు చంద్రబాబు.కాగావిజయ నిర్మలగారు లేరనే వార్త నన్ను షాక్‌కి గురి చేసింది. నటిగా, దర్శకురాలిగా సినిమా ఇండస్డ్రీకి ఆమె చేసిన సేవలు అనిర్వచనీయం. ఆమె మద్ధతు, సలహాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినిమా ఇండస్ట్రీ తప్పక మిస్ అవుతుంది. ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.