యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు పూర్తి చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా, సచిన్ తెందుల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్(24,208) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్ కోహ్లీనే కావడం మరో విశేషం.