యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు కాలేదు. చంద్రబాబు నాయుడు అవినీతి, పుట్టలు బద్ధలవుతున్నయి. రాజధాని పోలవరం భూకేటాయింపులు, విద్యుత్ ఒప్పొందాలువిషయంలో ఇప్పటికి 30 అంశాలను పరిశీలిస్తుంటే మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మీకు ఎందుకు కంటగింపు అయ్యింది. అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. 18,000 కోట్లు బకాయిలు విద్యుత్ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. అన్ని వ్యవస్థలను కూల్చివేశారు. 151 స్థానాలను భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిఒక్కరూ వీధి రౌడీ లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ళు కాదు ఇంకొక 25 ఏళ్ళు మీరు అధికారానికి వచ్చే అవకాశం లేదు. ప్రజావేదిక, అక్రమ కట్టడం కూల్చివేస్తే మీరు ప్రజలకు ఎం సందేశం ఇవ్వదలచుకున్నారు. అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్మిస్తే ప్రజలకు మీరు ఏమి సమాధానం చెప్తారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మీరు చేసిన అక్రమాలు బయటికి రావలసి ఉందని అన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా గోతిలో పడ్డారు మీ వీధి రౌడి చేష్టలు ప్రజలు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సమీక్ష చేసి తీరతాం. పురంధరేశ్వరి గారు మీరు మీ మ్యానిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చారు మర్చినట్లున్నారు. ప్రత్యేకహోదా మీరు ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. ప్రత్యేకహోదా గురించి మమ్ములను కట్టడిచేసే అర్హత మీకు లేదు. పోరాడే మమ్ములను మీరు ఎందుకు వెటకారం చేస్తున్నారని ప్రశ్నించారు..