YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

థర్డ్ ఫ్రెంట్ దిశగా కేసీఆర్ అడుగులు 

Highlights

  • రాజకీయాల్లో మార్పుకు జాతీయ సమావేశాలు 
  • తొలి విడతలో అధికారులతో భేటీలు 
  • రెండో విడతలో రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, న్యాయ నిపుణులతో 
  • ఆ తర్వాత అన్ని రాష్ట్రాల రైతులు, రైతు సంఘాలతో సమావేశాలు   
  • కేసీఆర్ సంచలన నిర్ణయం 
థర్డ్ ఫ్రెంట్ దిశగా కేసీఆర్ అడుగులు 

దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు జాతీయస్థాయి సమావేశాలకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో మార్పు రావాలని చెబుతూ థర్డ్ ఫ్రెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్  మరో అడుగు ముందుకు వేశారు. ఎవరూ ఊహించని నిర్ణయాలు ఆయన తీసుకున్నారు.హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో త్వరలో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. విడతలవారీగా ఆయా ఆధికారులతో సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ధీటుగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు, ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన అనూహ్యంగా దేశవ్యాప్తంగా భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే మమతా బెనర్జీ, సోరెన్, మహారాష్ట్ర ఎంపీలు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో విడతలవారీగా ఆయా ఆధికారులతో సమావేశం కానున్నారు. తొలి విడతలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్‌లతో భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉండే అధికారులతో ఆయన భేటీ కానున్నారని, వారి నుంచి సమాచారం సేకరించనున్నారని తెలుస్తోంది.రెండో విడతలో రిటైర్డ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, న్యాయ నిపుణులతో సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల రైతులు, రైతు సంఘాలతో సమావేశం కానున్నారు.


 

Related Posts