YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

భారత్ కు ట్రంప్ స్వీట్ వార్నింగ్

భారత్ కు ట్రంప్ స్వీట్ వార్నింగ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌కు షాకివ్వబోతోందా? ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రధాని మోదీని ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇందులో టారిఫ్‌లు తగ్గించాలని డిమాండ్ చేశారు. ‘భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. భారత్ చాలా ఏళ్లుగా అమెరికా ప్రొడక్టుల దిగుమతులపై అధిక టారిఫ్‌లను విధిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఇటీవలనే మళ్లీ సుంకాలను పెంచింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. టారిఫ్‌లను వెనక్కు తీసుకోవలసిందే’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. భారత్ ఈ నెల ప్రారంభంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు 29 ప్రొడక్టులపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. వీటిల్లో అల్మండ్స్, వాల్‌నట్స్, ఆపిల్స్ వంటివి ఉన్నాయి. భారత్ దిగుమతి సుంకాల పెంపు‌ను గత ఏడాది మే నుంచి వాయిదా వేస్తూ వస్తోంది. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకాల విధించడంతో సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భారత్ సుంకాలు తగ్గించాలని అమెరికాను కోరుతూనే వచ్చింది. అయితే ఫలితం దక్కలేదు. అంతేకాకుండా జీఎస్‌పీ హోదాను కూడా ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచింది. ఇకపోతే ప్రధాని మోదీ జపాన్‌లో జరుగుతన్న జీ20 సదస్సుకు వెళ్లారు. అక్కడ ట్రంప్ సహా వివిధ దేశాలకు చెందిన కీలక నేతలతో మోదీ భేటీ అవుతారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పటిన తర్వాత ట్రంప్‌తో మోదీ సమావేశం కానుండటం ఇదే ప్రథమం. హెచ్1 బీ వీసా, జీఎస్‌పీ ఉపసంహరణ నేపథ్యంలో ట్రంప్, మోదీ భేటీకి ప్రాధాన్యం సంతరించుకోనుంది.

Related Posts