YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాలన చేత కాక కొత్త కమిటీలు

పాలన చేత కాక కొత్త కమిటీలు

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ జగన్ వేసిన సబ్ కమిటీ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్‌కు పాలన చేతగాక ఏదో చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో వేసిన 26 సబ్‌కమిటీలే ఏమీ తేల్చలేకపోయాయని ఎద్దేశా చేశారు. గత ప్రభుత్వంపై ప్రతీకార చర్యలు మానుకుని జగన్ ముందుగా పాలనపై దృష్టి పెట్టాలని ఉమా సూచించారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ కమిటీలు వేస్తున్న జగన్.. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.5వేల కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టి చూపించాలని దేవినేని ఉమా సవాల్ చేశారు. తమ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు పకడ్బందీగా తీసుకుందని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్ అక్కడ విమర్శించడానికి ఏమీలేకే మాట్లాడకుండా వెనుదిరిగారని ఉమా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, అమలు చేసిన కార్యక్రమాలు, అప్పట్లో చేసుకున్న ఒప్పందాలు, కాంట్రాక్టుల వంటి అంశాలన్నింటిని సమీక్షించి నిజానిజాలు వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ పోలవరం, రాజధాని పనుల వంటి ప్రధాన ప్రాజెక్టులు, విద్యుత్తు రంగంలోని పీపీఏల్లో అవినీతి, అవకతవకలను లోతుగా పరిశీలించి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కక్ష పూరితంగా ఈ కమిటీ వేశారని ఆరోపిస్తున్నారు.

Related Posts