యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తాడేపల్లిలోని రేవేంద్రపాడు నుంచి సీతానగరం వెళ్లే రోడ్డును విస్తరించేందుకు అనుమతిస్తూ.. రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ఏపీ సర్కారు బుధవారం జీవో జారీ చేసింది. ఈ రోడ్డు నేషనల్ హైవేను తాడేపల్లి-నూతక్కి రోడ్డుతో కలుపుతుంది. 1.3 కి.మీ. పొడవైన ఈ రోడ్డు పక్కనే సీఎం నివాసం ఉంది. సీఎం ఇంటి సమీపంలో వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడటం కోసం, ఆయనకు భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడటం కోసం 1.3 కి.మీ పొడవునా రోడ్డును విస్తరిస్తున్నారు. కాగా, 1.3 కి.మీ. రోడ్డు విస్తరణకు రూ.5 కోట్లు ఖర్చు చేయడమేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ‘‘గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ నివసిస్తున్న రేవేంద్రపాడు – సీతానగరం రోడ్డును డబుల్ లేన్‌గా మార్చడానికి రోడ్లు భవనాలశాఖ అక్షరాలా ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది. ''కేవలం 1.30 కిలోమీటర్ల రోడ్డును వెడల్పు చేసి అభివృద్ధి చేసేందుకు అంత ఖర్చా'' అని అడగొద్దు’’ అని టీడీపీ ట్వీట్ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ నివసిస్తున్న రేవేంద్రపాడు – సీతానగరం రోడ్డును డబుల్ లేన్‌గా మార్చడానికి రోడ్లు భవనాలశాఖ అక్షరాలా ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది. ''కేవలం 1.30 కిలోమీటర్ల రోడ్డును వెడల్పు చేసి అభివృద్ధి చేసేందుకు అంత ఖర్చా'' అని అడగొద్దు.దీనికి వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఫామ్ హౌస్‌లో పాములను పట్టడానికి రూ.7.5 లక్షలు ఖర్చు పెట్టగా లేనిదీ.. రోడ్డు విస్తరణకు రూ.5 కోట్లు ఖర్చు పెట్టడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే రూ.1.3 కి.మీ. పొడవైన రోడ్డు విస్తరణకు నిజంగానే రూ.5 కోట్లు అవసరమా? అయితే ఎందుకో ఏపీ సర్కారే సమాధానం చెప్పాలి.