YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

ఏపీలో మాటల యుధ్ధం మళ్ళీ మొదలైంది. కొత్త ప్రభుత్వం వచ్చి నెల కూడా కాక ముందే మీడియా ముందుకు తమ్ముళ్ళు వచ్చి హడావిడి చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి మీద ఘాటు విమర్శలతో రెచ్చిపోతున్నారు. కనీసం సర్ధుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదు. జగన్ సైతం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూండడంతో వాటికి కౌంటర్ ఇవ్వకపోతే ఎక్కడ వెనకబడిపోతామోనని టీడీపీకి  భయంగా ఉంది. ఇక ఉండవల్లి ప్రజావేదికగా రచ్చ రచ్చ సాగుతోంది. దాన్ని టీడీపీ సొంత ఆస్తిగా భావిస్తూంటే ఎక్కడ కొట్టాలో అక్కడే జగన్ గట్టిగా కొట్టేశారు. ఓ విధంగా షాక్ ట్రేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో టీడీపీకి కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితి తయారైంది.ఉండవల్లి ప్రజావేదిక అక్రమ నిర్మాణం అంటున్నారు వైసీపీ నేతలు, కాదు అది అన్నీ ఉన్న సక్రమ నిర్మాణం అంటున్నారు టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ అక్రమ కట్టడం కూల్చేయండని ఆదేశాలు జారీ చేశారు. దాంతో టీడీపీ వెన్నులో చలి మొదలైపోయింది. అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేత ఇక్కడితో మొదలుపెట్టాలని జగన్ అన్నారు. దీని మీద మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇది తుగ్లక్ చర్య అంటూ ఘాటైన పదజాలమే వాడారు. తాము ఎంతో కష్ట‌పడి నిర్మించి ఇచ్చిన భవనాన్ని కూల్చివేయడం ద్వారా వైసీపీ సర్కార్ విద్వంసక   చర్యలకు దిగుతోందని ఆయన గర్జిచారు. పోలవరం కూల్చేస్తారా. సచివాలయం, అమరావ‌తి కూడా కూల్చేస్తారా అంటూ పెద్ద గొంతు చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ సంబంధం లేని రాధ్ధాంతపు మాటలు, ప్రజావేదిక  అక్రమ కట్టడం అని వైసీపీ చాన్నాళ్ళుగా చెబుతోం ది, ఇపుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పకుండా తుగ్లక్ చర్య అనడం ఏంటి అంటున్నారు వైసీపీ నేతలు, అక్రమ కట్టడాలు నిర్మించడం తుగ్లక్ చర్య కాదా అని నిలదీస్తున్నారు.ఇదిలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మేధావులు, ఇతర వర్గాలు మెచ్చుకుంటూనే కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎనిమిది కోట్లతో ప్రజావేదిక కట్టారని వైసీపీ నేతలు, కాదు పదకొండు కోట్లు అంటూ టీడీపీ నేతలు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కట్టిన భవనాన్ని కూల్చడం ద్వారా ప్రజల సొమ్ము వ్రుధా అవుతుంది. అందువల్ల ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన భవనాలకు బాధ్యులను చేస్తూ నాటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన టీడీపీ నాయకుల నుంచే ఈ సొమ్ము వసూల్ చేయాలని అంటున్నారు. ఆ విధంగా ప్రజాధనం కాపాడాలని కూడా సూచిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా ఏపీవ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడం ద్వారా చట్టం మీద నమ్మకం కలిగించాలని, జనాలకు బలమైన సందేశం పంపాలని కూడా కోరుతున్నారు. ముందుగా కరకట్ట మీద నిర్మించిన అక్రమ కట్టడం తో కూల్చివేత పనులు మొదలెట్టాలని కోరుతున్నారు.

Related Posts