YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

టార్గెట్ తెలుగు రాష్ట్రాలు

 టార్గెట్ తెలుగు రాష్ట్రాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని కమలం పార్టీ పూర్తిగా ఢిల్లీ నుంచే మోనిటరింగ్ చేస్తోంది. నరేంద్ర మోడీ, అమిత్ షా కనుసన్నలలోనె పావులు కదులుతున్నాయి. తెలంగాణా విషయంలో బీజేపీకి ఒకింత పిక్చర్ క్లారిటీగా ఉంది. అక్కడ కేసీయార్, కేటీయార్, మధ్యలో హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీలో మెల్లగా అసమ్మతి వంటివి బీజేపీకి బాగా ఉపకరించేవే. కేసీయార్ తరువాత ఆ స్థాయిలో పార్టీని నడిపించే దిక్కు టీఆర్ఎస్ లో లేదన్నది వాస్తవం. అందుకే 2023 ఎన్నికల మీద కమలం పార్టీ బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఏపీలో టీడీపీ ప్లేస్ ని వైసీపీ తీసుకుంది. ఆ పార్టీ బలంగా మారింది. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మరో ప్రాంతీయ పార్టీకి ఇక్కడ అధికారం బదలాయింపు జరిగింది. జాతీయ పార్టీ బీజేపీకి నోటా కంటే కూడా ఓట్లు తక్కువ వచ్చాయి.ఇక ఏపీ సీఎం జగన్ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్ అద్భుతమైన జనాదరణతో రికార్డ్ స్థాయి సీట్లతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఆయన మీద ఇప్పుడే ఆరోపణలకు దిగడం భావ్యం కాదు అన్నట్లుగా ఉంది నరేంద్ర మోడీ, షాల ఆలోచన. అదే సమయంలో జగన్ కి సహకరిస్తున్నట్లుగానే ఉంటూ అవసరమైన చోట తమ ముద్ర చూపించాలని కూడా ఈ ఇద్దరి ఆలోచనలూ ఉన్నాయి. ఇక జగన్ అడిగిన ప్రత్యేక హోదాని నిరాకరించడం ద్వారా దూరం జరిగినట్లుగా ఉన్న బీజేపీ నిధుల విషయంలో కొంత సర్దుబాటు ధోరణి చూపించి తద్వారా ఏపీ జనాలకు దగ్గర కావాలనుకుంటోంది.ఇక చంద్రబాబు విషయంలో కూడా మోడీ, షాల వద్ద వేరే ప్లాన్ ఉందని అంటున్నారు. చంద్రబాబుని ఇప్పటికిపుడు ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. బాబు ఇప్పటికే పరాజయ భారంతో క్రుంగిపోయారని, ఆయన పార్టీ దారుణంగా తయారైందని ఈ ఇద్దరు అగ్ర నాయకులు భావిస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్ లో బాబు పార్టీ మీద మరింత అభద్రతాభావం కలగచేయడం ద్వారా బీజేపీలోకి చేరికలను ప్రోత్సహించాలన్నది ఎత్తుగడగా ఉంది. ఇక బాబు వయసు, ఆయన పార్టీలో తిరిగే ఓపిక ఇవన్నీ చూసుకుని తీరిగ్గా ఆయన మీద కేసుల విషయం చూడాలనుకుంటున్నారట. బాబుని ఇప్పటికిపుడు ఇబ్బంది పెడితే అది జగన్ కి రాజకీయ లాభమని, బాబుని ప్రతిపక్షంలో ఉన్నట్లుగా లేనట్లుగా చేసి జగన్ కి ఆ పక్క బెదురు అలాగే ఉంచాలన్నది కూడా బీజేపీ పెద్దల ఆలోచనట. మొత్తానికి అటు బాబు ఇటు జగన్ ని నరేంద్ర మోడీ పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తున్నారని అంటున్నారు.

Related Posts