యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
గురువారం వెస్టిండీస్‌ను భారత్ 125 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. షమి (4/16), బుమ్రా (2/9), చాహల్ (2/39)ల ధాటికి 143 పరుగులకే కుప్పకూలింది. 31 పరుగులు చేసిన ఆంబ్రిసే ఆ జట్టులో టాప్‌స్కోరర్. కోహ్లి (72; 82 బంతుల్లో 8×4), ధోని (56 నాటౌట్; 61 బంతుల్లో 3×4, 2×6), రాహుల్ (48; 64 బంతుల్లో 6×4), పాండ్య (46; 38 బంతుల్లో 5×4) రాణించడంతో మొదట భారత్ 7 వికెట్లకు 268 పరుగులు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 6 మ్యాచ్‌ల్లో ఐదో విజయం సాధించిన భారత్.. 11 పాయింట్లతో (మ్యాచ్ రద్దు వల్ల ఒక పాయింట్) సెమీస్ బెర్తుకు అత్యంత చేరువలో నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఐదో ఓటమి చవిచూసిన విండీస్ (3 పాయింట్లు) సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా విండీస్ పాయింట్లు ఏడే అవుతాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఇప్పటికే 8 పాయింట్లతో ఉన్న నేపథ్యంలో విండీస్ టాప్-4లోకి రావడానికి అవకాశం లేదు.