Highlights
- వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ టోర్నీ
- మిగతా టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు లేవు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-11) సీజన్ 2018 టోర్నీప్రారంభ వేడుకల తేదీతో పాటు వేదిక కూడా మారిపోయింది.వాస్తవానికి ఈ రోజుకి ఐపీఎల్ మ్యాచ్ సరిగ్గా నెల రోజులు మాత్రమే మిగిలివుంది. వచ్చే నెల 7నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకల తేదీలో మార్పుతో పాటు వేదిక కూడా మారింది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు సోమవారం మీడియాకు వెల్లడించారు.బీసీసీఐ పాలకుల కమిటీ తాజా నిర్ణయంతో ఐపీఎల్ టోర్నీ ప్రారంభమయ్యే (ఏప్రిల్ 7) రోజున.. ఆరంభ మ్యాచ్ జరిగే వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలను నిర్వహించనున్నారు. టోర్నీలోని మిగతా టోర్నమెంట్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక ఐపీఎల్ టోర్నీలో చివరి మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియం వేదికగా మే 27తో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఒక్క రోజు ముందుగానే ఏప్రిల్ 6న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఐపీఎల్ 11 సీజన్ ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉంది. కానీ, ఐపీఎల్ గవర్నంగ్ కౌన్సిల్ తొలుత రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఐపీఎల్ టోర్నీ ప్రారంభ వేడుకులను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. కానీ, వేడుకలకు అయ్యే ఖర్చును రూ. 20 కోట్లు తగ్గించి రూ. 30 కోట్లతోనే వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ పాలక కమిటీ సభ్యులు సూచించినట్టు సమాచారం.