YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అర్హులైన పేదలందరికీ ఇళ్ళు - మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..

అర్హులైన పేదలందరికీ ఇళ్ళు - మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 అర్హులైన పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే ప్రణాళిక సిద్దం చేస్తున్నాం అని నవంబర్ నాటికి 6576 ఇళ్ళు దాదాపుగా పూర్తి అవుతాయని మంత్రి వెలంప ల్లి శ్రీనివాస రావు  పేర్కొన్నారు.  శుక్రవారం ఉదయం సచివాలయం లో మంత్రి తన  ఛాంబర్ లో పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారుల తో సమావేశం నిర్వహించారు.  ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇళ్ళు పంపిణీ చెయ్యాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఇప్పటి వరకూ విజయవాడకు కేటాయించిన 55,800 ఇళ్ళకు గాను నవంబర్ నాటికి జక్కంపూడి లో 6,576 ఇళ్ళు గ్రౌండ్ పూర్తి చెయ్యటం జరుగుతుంది అన్నారు. ఇందులో 3,840 ఇళ్ళకు స్లాబ్ వర్క్ పూర్తి చెయ్యటం జరిగిందన్నారు.  మిగిలిన ఇళ్ళ పూర్తి చేసేందుకు గాను 430 ఎకరాల భూమి సేకరించవలసి ఉందని, అందుకుగాను సూరంపల్లి లో 180 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో తిలోచనపురం లో 360 ఎకరాలు, ములపాడు నందు 48 ఎకరాలు సేకరించేందుకు సాద్య సాద్యాల పై పరిశీలించ మని అధికారులకు తెలిపారు.  పట్టణ గృహ నిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారుల తో మరో సమావేశం నిర్వహించి నిర్ణయం తెలుపుతామన్నారు.. ఈ సమావేశంలో  పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి .చిన్నోడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన రావు, జక్కంపూడి అసిస్టెంట్ ఇంజనీర్ రంగ రాజు,  తదితరులు పాల్గొన్నారు.

Related Posts