YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు ఎంపీ సవాల్

జగన్ కు ఎంపీ సవాల్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కృష్ణా కరకట్టపై ఉన్న ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతతో అక్రమ నిర్మాణాల వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కూల్చివేతలు కేవలం ప్రజావేదికకు పరిమితం చేస్తారా అనే అనుమానాలు కలిగాయి. ఈలోపే ప్రభుత్వం కరకట్టపై ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలకు నోటీసులు పంపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న నివాసానికి నోటీసులు అందాయి. దీంతో టీడీపీ విమర్శలకు చెక్ పడినట్లయ్యింది.. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌కు మరో సవాల్ విసురుతున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన నాని.. గౌరవ ముఖ్యమంత్రి గారు.. నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై - డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా అంటూ ప్రశ్నించారు. లేకపోతే రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో.. మన రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా అని అడిగారు. కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు అంటూ ప్రశ్నించారు. అంటే నాని కృష్ణా నది మాత్రమే కాదు.. గోదావరి తీరం వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలంటున్నారు. అది కూడా నదీ పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న అన్ని భవనాలను కూలుస్తారా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి టీడీపీ ఎంపీ కేశినేని అడిగిన ప్రశ్నలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. కేశినేని నాని నిన్న కూడా ప్రజావేదిక కూల్చివేతపై సెటైర్లు పేల్చారు. ఇంకా నయం.. తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా లోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు

Related Posts