యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముగిసింది. తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలవనరుల అంశంపై శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ హైలెవల్ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరి నీటి లభ్యతపై జగన్ తదితరులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల ద్వారా 4,000 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటితో రెండు తెలుగు రాష్ట్రాలను సుసంపన్నం చేయవచ్చని అన్నారు. గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి నీటిని శ్రీశైలం, సాగర్ కు తరలిస్తే ఏపీ, తెలంగాణలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. దీనివల్ల రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు మేలు చేకూరుతుందని వివరించారు. నీళ్ల కోసం ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగడం కంటే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే మార్గాలపై దృష్టిపెట్టడం మేలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రపభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన చేస్తోందని, తెలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చాక కేంద్రం ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, వంశధార, నాగావళి నదీజలాలను కూడా సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నదీజలాలు సముద్రంపాలవకుండా చూస్తే ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు తీరతాయని, తద్వారా, నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన ఉత్తరాంధ్ర వాసుల్లో ఉండదని వెల్లడించారు. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు వేర్వేరు అనే భావన తమకు లేదని ఇరువురు సీఎంలు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించారు. గోదావరి జలాలను శ్రీశైలంలోకి తరలించే ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఇరువురు సీఎంలు ఆదేశించారు. రెండు తెలుగు రాష్ర్టాలు పచ్చగా కళకళలాడాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎంలతో పాటూ ఏపీ నుంచి ఆరుగురు మంత్రులు.. తెలంగాణ నుంచి నలుగురు మంత్రులు కూడా చర్చల్లో పాల్గొన్నారుక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమచంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.అలాగే తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్ కో -ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులున్నారు. ఈ అంశాలు ఒ కొలిక్కి వచ్చాక మిగిలిన విషయాలపై చర్చించనున్నారు. విద్యుత్తు సంస్థల విభజన, షెడ్యూల్-9, షెడ్యూల్-10లో సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ పంపకాలకు సంబంధించిన బిల్లుల బకాయిలు, ఏపీ భవన్ విభజన వంటి ప్రధాన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ఇద్దరు సీఎంల సమావేశం శనివారం కూడా కొనసాగనుంది. రెండు రోజుల పాటూ ఈ అంశాలపై చర్చించి.. పరస్పరం ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది.