యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పీవీ ఘనతను కొనియాడారు. ‘నుభవజ్ఞులైన పరిపాలకుడు పీవీ నరసింహారావు...కష్టకాలంలో దేశాన్ని సమర్థంగా నడిపించి చరిత్రలో నిలిచారు.. గొప్ప పండితుడైన పీవీ దేశాభివృద్ధికి బాటలు వేశారని’ మోదీ గుర్తు చేసుకున్నారు. మోదీతోపాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత సైతం ట్విట్టర్‌లో స్పందిస్తూ పీవీ నరసింహారావుపై ప్రశంసలు కురిపించారు. బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు ఉన్నారని చంద్రబాబు కీర్తించారు. ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావేనని ప్రశంసించారు. ట్విట్టర్‌లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన అమూల్యమైన సంస్కరణలను తెచ్చి అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు పీవీ అని చంద్రబాబు కితాబిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, పీవీ నరసింహారావుతో దిగిన ఓ ఫొటోను చంద్రబాబు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన ఒకే ఒక్క తెలుగువాడు, దేశ ఆర్ధికవ్యవస్థలో అమూల్యమైన సంస్కరణలతో అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు శ్రీ పీవీ.నరసింహరావుగారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’అని ట్వీట్ పెట్టారు. బహుభాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన ఒకే ఒక్క తెలుగువాడు, దేశ ఆర్ధికవ్యవస్థలో అమూల్యమైన సంస్కరణలతో అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు శ్రీ పీవీ.నరసింహరావుగారి జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను.మరోవైపు, దేశ ఆర్థిక సంస్కరణల కర్త అయిన పీవీ నరసింహారావుకి తగిన గుర్తింపు ఇవ్వలేదనీ, అన్యాయం చేశారని ఆయన మనవడు ఎన్ వీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పీవీ నరసింహారావుకి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సుభాష్ తప్పుబట్టారు. వీపీ ప్రధానిగా ఉన్నప్పుడు నెహ్రూ-గాంధీ కుటుంబాల్ని తక్కువ చేసేందుకు యత్నించారని చిన్నారెడ్డి కామెంట్ చేశారు. ఇది నిజం కాదన్నఆయన దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు