YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Highlights

  • దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రకంపనలు
  • 8శాతం లాభాలతో బీఈఎంఎల్‌ 
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయంగా పీఎన్‌బీ సంక్షోభం వంటి అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టించాయి.  ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్‌లకుతోడు కావడంతో మార్కెట్ బలహీనపడింది. ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. పీఎన్‌బీ, గీతాంజలి మరింత కుదేలవ్వగా ఎస్‌బీఐ స్వల్పంగా కోలుకుంది. సెన్సెక్స్ 300‌ పాయింట్ల  నష్టంతో 33746 వద్ద నిఫ్టీ 100 పాయింట్ల పతనంతో 10,358 వద్ద క్లోజ్‌ అయ్యాయి. దాదాపు అన్నిరంగాలూ బలహీనపడగా..మెటల్‌ బాగా దెబ్బతీసింది. ఇంకా ఇదే బాటలో  పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ,  ఫార్మా నష్టపోయాయి.అలాగే  ప్రభుత్వ వాటా విక్రయం వార్తలతో బీఈఎంఎల్‌ పాజిటివ్‌గా దాదాపు 8శాతం లాభాలతో ముగిసింది.
 

Related Posts