యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. కేంద్ర మంత్రి అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. కశ్మీర్ పరిస్థితి ఎలా ఉందంటే.. శ్మశానవాటికలో శాంతిని చూస్తున్నట్లుగా ఉందని అసద్ అన్నారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో అర్నెళ్లు పొడిగించాలని ఇవాళ షా లోక్‌సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరుగుతోంది. మన హోంశాఖ మంత్రికి ఎటువంటి శాంతి కావాలి, మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ ప్రతిపాదించిన చర్చలకు ఆయన అంగీకరిస్తారా, జర్నలిస్టు సుజాత్ బుకారి హత్య దర్యాప్తులో జరిగిన పురోగతిని ఆయన వివరిస్తారా, కశ్మీర్‌లో డిలిమిటేషన్‌కు ఓకే చెబుతారా, మీకు శాంతి కావాలా లేక శ్మశానవాటికలో శాంతి కావాలా అని ప్రశ్నించారు. కశ్మీర్ అంశంపై టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు కూడా మాట్లాడారు.