పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ పై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమర్‌నాథ్‌కు వెళ్తున్న యాత్రికులపై దాడి చేసేందుకు జైషే మొహ్మద్ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిపాయి. ఈ విషయంలో భద్రతాబలగాలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన ముగిసిన రోజే నిఘావర్గాలు ఈ హెచ్చరిక జారీ చేశాయి. జమ్మూలోని శ్రీనగర్‌కు 141 కి.మీ.దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్ యాత్ర మొదలవుతుంది. అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంపు ఇక్కడే ఉంటుంది. బేస్ క్యాంపు నుంచి బృందాలుగా అమర్‌నాథ్ యాత్రకు వెళతారు. ఏటా జూలై ,ఆగస్టు నెలల్లో 45 రోజుల్లో శివుడి దర్శించుకుంటారు భక్తులు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది.