YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వాట్సాప్ లో కొత్త ఫీచర్‌

Highlights

  • ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌‌’ వ్యవధి పెంపు 
  • త్వరలో ఐఫోన్‌లకూ
  • ఫార్వర్డ్‌ మెసేజ్‌ ఫీచర్‌ కూడా 
వాట్సాప్ లో కొత్త ఫీచర్‌

 ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌‌’ కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ బీటాఇన్‌ఫో అప్‌డేట్‌ చేసింది. వాట్సాప్ బీటా (వీ2.18.69) వెర్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా గంట సమయం తర్వాత కూడా ఇతరులకు పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం 7 నిమిషాల్లోపు మాత్రమే పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసే వీలుంది. ఇటీవలే ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే అప్‌డేట్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పొరపాటుగా అనవసరమైన ఓ మెసేజ్‌లను ఇతరులకు పంపిస్తే.. వారు చూడకముందే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసే సదుపాయాన్ని దీనిద్వారా కల్పించింది. తాజా అప్‌డేట్‌తో మెసేజ్‌లను 7 నిమిషాల్లోపే కాకుండా గంట తర్వాత కూడా డిలీట్‌ చేసుకోవచ్చు. ఇతరులకు పంపించిన మెసేజ్‌లను 68 నిమిషాల 16 సెకన్లలోపు డిలీట్‌ చేసుకోవచ్చు. (వీ2.18.68) వాట్సాప్ బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం స్టిక్కర్ ఫీచర‌ అప్‌డేట్‌ను కూడా అందిస్తోంది. కానీ, ఆ ఫీచర్ అప్రమేయంగా డిసేబుల్‌గా ఉంటుంది. ఆండ్రాయిడ్‌లో పని చేసే మరో రెండు బీటా వెర్షన్‌ (వీ2.18.70, వీ.2.18.71) లను వాట్సాప్ ప్రవేశపెట్టింది. త్వరలో ఐఫోన్‌లో కూడా ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని వాట్సాప్ యోచిస్తోంది. మరోవైపు వాట్సాప్ ఫార్వర్డ్‌ మెసేజ్‌ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోన్నట్లు సమాచారం.
 

Related Posts