యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చిత్తూరు జిల్లా ఉసరపెంట గ్రామంలో పోలీసులు భారి ఎత్తున మోహరించారు. పరువు హత్యకు గురయిన మృతురాలు హేమవతి మృతదేహానికి పోస్టుమార్టం శనివారం ఉదయం చేసారు. తరువాత ఉసరిపెంటకు హేమవతి మృతదేహన్ని తరలించారు. హేమవతిని ప్రేమ వివాహం చేసుకున్న భర్త కేశవులు దళిత సాంప్రదాయ బద్దంగా హేమవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తన భార్య హత్య, తన పై దాడికి ప్రభుత్వం స్పందించాలిని కేశవులు డిమాండ్ చేసాడు.
హేమవతి తండ్రి భాస్కర్ నాయుడుతో పాటు బంధువులులను కటినంగా శిక్షించాలని అన్నారు. ఘటనతో గ్రామంలో కులాల గొడవలు, పరస్పర దాడులు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు నిందుతులు కోసం గాలింపులు కొనసాగుతున్నాయి.