యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో బంట్రోతు వారి వీధిలో నివాసముంటున్న అయ్యప్పదేవాలయ వ్యవస్థాపకులు గురుస్వామి కె ఎల్ కనకరాజు ఇంట్లో చోరీ జరిగిందని మండపేట రూరల్ అదనపు ఎస్ ఐ రేవతి తెలిపారు. సమాచారం అందుకున్న ఆమె సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. గురుస్వామి కుటుంబం ఇంట్లో లేకపోవడంతో శనివారం ఉదయం స్థానికులు గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీనిపై రూరల్ సిఐ కె మంగదేవి వివరణ ఇచ్చారు. తమకు సమాచారం వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి రూరల్ అదనపుఎస్ ఐ రేవతి ను పంపినట్లు వెల్లడించారు. కనకరాజు కుటుంబం చెన్నై వెళ్లినట్టు ఎస్ ఐ రేవతి తెలిపారు. ఇంట్లో ని 16 కాసుల బంగారం, రూ 2 లక్షల నగదు చోరీ అయినట్లు ప్రాధమికంగా గుర్తించామని వెల్లడించారు. దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.