యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
టీటీడీ వసతి సముదాయాల కేటాయింపుల్లో స్వల్ప మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మార్పులు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో గదుల బుకింగ్లో స్వల్ప మార్పులను టీటీడీ చేసింది. విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరెంటు బుకింగ్ పద్ధతిలో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ గదులు తీసుకున్న భక్తులు 24 గంటల్లోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో మాత్రం అన్ని గదులను ఇకనుంచి ఆన్లైన్ పద్ధతిలోనే భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం ఎనిమిది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు 24 గంటల స్లాట్ విధానం అమల్లో ఉంటుంది. బుక్ చేసుకున్న సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నా, నిర్దిష్ట సమయానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది.