యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో యువకునిపై జరిగిన దాడి సంచలనం రేపుతోంది నగర నడిబొడ్డున శివయ్య అనే యువకునిపై ఆరడుగులు యువకులు మూకుమ్మడిగా దాడి జరిగింది అయితే ఈ గొడవ ఈనెల 25న మధ్యాహ్నం జరిగిందని డి ఎస్ పి పిఎన్ బాబు తెలిపారు. వివరాల్లోకి వెళితే శివయ్య అనే వ్యక్తి సెల్ టవర్ నిర్మాణం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు తన స్నేహితుడు రాజేష్ ఫోన్ చేసి పిలిపించుకున్నాడు అయితే అక్కడికి వెళ్ళిన శివయ్యను భరత్ తో పాటు అతని స్నేహితులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు రాళ్లతో ఇనుపరాడ్లు బెల్టుతో కిరాతంగా చావు దెబ్బలు కొట్టారు .దీంతో తీవ్ర గాయాలపాలైన శివయ్యను కొందరు యువకులు వైద్య సేవల కోసం స్థానిక సర్వజన ఆస్పత్రికి తరలించారు ఈ విషయం ప్రసారమాధ్యమాల్లోవైరల్ కావడంతో పోలీసులు స్పందించారు అక్కడి నుంచి వైద్య సేవలు పొందుతున్న బాధితుడు నిన్న డిస్చార్జ్ అయ్యాడని అయితే ఈ దాడికి గల ప్రధాన కారణం కేవలం ప్రేమ వ్యవహారమే అని తెలుస్తుంది అని డి.ఎస్.పి పీఎం బాబు తెలిపారు.ఈదాడిలో పాల్గొన్న వారిని రేపు అరెస్ట్ చేసి కోర్టుకు ఎదుట హాజరు కానున్నట్లు తెలిపారు అదేవిధంగా వీరిపై రౌడీషీటర్లను తెరిచి అని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వివరించారు