Highlights
- మహిళా దినోత్సవానికి ప్రత్యేక విమానం
- ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో-ఢిల్లీ మధ్య విమానం
నేషనల్ క్యారియర్ ఎయిరిండియా ఇప్పుడు మహిళా సిబ్బందితో ఓ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. ప్రపంచంలోనే తొలిసారి అంతా మహిళా సిబ్బందితో కూడా విమానాన్ని 1985లో ఎయిరిండియా నడిపింది. అత్యంత పొడవైన మార్గం ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో-ఢిల్లీ రూట్లో కూడా అంతా మహిళా సిబ్బందితో ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడిపి, ప్రపంచ రికార్డును సాధించింది. జాతాగా కలకత్తా -డిమాపూర్- కలకత్తా సెక్టార్లో ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన ఈ విమానంలో అందరూ మహిళా సిబ్బందికావడం విశేషం. ఎయిరిండియా జనరల్ మేనేజర్, పర్సనల్ నవ్నీత్ సిధు, ఇతర సీనియర్ సిబ్బంది కలిసి ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారని ఎయిర్లైన్స్ పేర్కొంది. విమానం ఏఐ709, ఎయిర్బస్ లకు కాక్పిట్ సిబ్బందిగా కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ వ్యవహరిస్తుండగా.. క్యాబిన్ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్రాజ్, టీ ఘోస్, యతటిలి కత్లు ఉన్నారు.