YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న జీహెచ్‌ఎంసీ: చాడ

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న జీహెచ్‌ఎంసీ: చాడ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అక్రమ కట్టడాల నిర్మూలనలో జీహెచ్‌ఎంసీ విఫలమైందని ఆరోపిస్తూ.. సీపీఐ, కాంగ్రెస్‌, టీడీపీ, జనసమితి అధ్యర్యంలో శనివారం జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల నిర్మూలన విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతుంటే.. కేసీఆర్‌ మాత్రం నిద్ర పోతున్నారని విమర్శించారు.ఒకప్పుడు హైదరాబాద్‌లో 800 వరకూ చెరువులుండేవన్నారు. ప్రస్తుతం అవన్ని కబ్జాకు గురయ్యయన్నారు. వాటన్నిటిని వెలికి తీయలని డిమాండ్ చేసారు. జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కొమ్ముకాస్తూ జనాలకు నరకం చూపిస్తున్నారని విమర్శించారు. చెరువుల పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. కేసీఆర్‌కు ప్రజలు తగిన బుడ్డి చెపుతారన్నారు.

Related Posts