యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చిత్తూరు జిల్లాలో జరిగిన పరువుహత్య కేసు కలకలం రేపుతోంది. ప్రేమ వివాహం చేసున్న పాపానికి వెనుక బడ్డ కులానికి చెందిన వాడిని పెళ్ళి చేసుకుందని అగ్రకుల దురహంకారం తో కుటుంబం అంతా కలసి కన్న కూతురునే కడతేర్చింది. పచ్చి బాలెంతరాలు అన్న జాలి అయినా చూపకుండా పీక పిసికి చంపి మురికి కాలవలో పడేసారు కసాయి తల్లిదండ్రులు. మనవడు అన్న మమకారం కూడా లేకుండా 7 రోజుల పసికందును నడిరోడ్డు పైన విసిరి కొట్టి వెళ్లిపోయారు. విషయానికొస్తే పలమనేరు నియోజకవర్గం ఉసిరి పెంట గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు కుమార్తె హేమవతి అదే గ్రామంలోని ఎస్సీ కాలనీ చెందిన గోవిందు కొడుకు కేశవులు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే ఈ పెళ్లిని అమ్మాయి తరఫున వారు అంగీకరించకపోవడంతో వివాహం అనంతరం వేరు వేరు చోట్ల తలదాచుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 7 రోజుల క్రితం హేమావతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డను చూసైనా నా తల్లిదండ్రులకు మనసు కలుగుతుందని భావించిన ప్రేమికులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు .పలమనేరులో బిడ్డను ఆసుపత్రికి తీసుకు వెళ్లి వస్తుండగా హఠాత్తుగా హేమవతి తండ్రి భాస్కర్ నాయుడు తో పాటు తల్లి ఇతర కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వారి మీద దాడి చేశారు. బలవంతంగా హేమవతి ని బైక్ మీద ఎక్కించుకొని సమీపంలోని మామిడి తోట కి తీసుకు వెళ్లారు అక్కడ అ హేమావతి పీక పిసికి చంపి మృతదేహాన్ని
పక్కనే ఉన్న మురికి కాలవలో పారేశారు బిడ్డను విసిరికొట్టారు జరిగిన అన్యాయం తెలిసి భార్య పుట్టింటికి వెళ్ళిన కేసవులు పైన దాడి చేశారు అతని బైక్ తగలబెట్టారు దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు భాస్కర్ నాయుడు ఇంటికి వెల్లి ఆందోళన చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని నిందితులను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు