యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఎన్నికల తీర్పు తర్వాత ఆయన మెదడు మరింత దెబ్బతిందని విమర్శించారు. స్థాయికి మించి చెలరేగుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని తమపై కుట్ర చేశారని విమర్శించారు. ఈ మేరకు శనివారం (జులై 29) ఆయన వరస ట్వీట్లు చేశారు.
‘మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. విజయవాడలో దోమల పేరు చెప్పి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇలాంటి కుట్ర గురించి తొలిసారిగా వింటున్నామని విమర్శించారు.. మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది. స్థాయికి మరచి చెలరేగుతున్నారు. మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు. ఇప్పడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిలుపై ఉన్నారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది.‘విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డేటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయ స్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు. ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.వైఎస్సార్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే నడిరోడ్డుపై నరికేస్తానంటూ ఓ జర్నలిస్టును బెదిరించారని నారా లోకేశ్ శుక్రవారం సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్‌కు ఓ ఆడియో క్లిప్‌ను కూడా జత చేశారు. ఈ రాక్షస పాలనలో జర్నలిస్టుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ‘దయచేసి కుటుంబ సభ్యులతో ఈ అసభ్య పదజాలం వినకండి’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. లోకేశ్ ట్వీట్ నేపథ్యంలో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత రాజుకుంది.
జగన్ సెటైర్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని జగన్ భ్రమరావతి అన్నారనీ, ఆయన భ్రమలు తొలగించేందుకు భవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సీట్లో కూర్చున్నప్పుడు, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకో అని భగవంతుడు తన స్క్రిప్ట్ లో కామా పెట్టాడని తెలిపారు. ‘టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే.. అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్క్రిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడు. మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లను మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడు. దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు.రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు’ అని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నేతలు మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.