YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్, కేసీఆర్ భేటీ సరే... కానీ

జగన్, కేసీఆర్ భేటీ సరే... కానీ

గోదావరి వరద జలాల వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ముందడుగు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీపై తెలుగుదేశం నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్న కేశినేని, కానీ అంటూ మరో ప్రశ్న సంధించారు. జగన్‌ ప్రతిదీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా?లేక ఆంధ్రాకు పెండింగ్‌లో ఉన్న ప్రతిదీ సాధిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ‘జగన్‌మోహన్ రెడ్డిగారూ ఆంధ్రా, తెలంగాణ మధ్య నెలకున్న వివాదాలు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మీకు దేవుడిచ్చిన స్నేహితుడి కేసీఆర్‌తో చూపుతున్న చొరవకు అభినందిస్తున్నాను... కానీ ప్రతి అంశంలో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా?లేక ఆంధ్రాకు పెండింగ్‌లో ఉన్న ప్రతిదీ సాధిస్తున్నారా?’అంటూ ట్వీట్ చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై తనదైన శైలిలో కేశినేని వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం విదితమే.‘ఇంకా నయం... తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే’ అంటూ నాని సెటైరికల్‌గా ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు. జల వివాదాలు, గోదావరి వరద జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్‌ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ మంత్రులు, సీఎస్‌లు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం రెండు రోజుల పాటు ఈ భేటీలు కొనసాగాలి. కానీ, అనూహ్యంగా శనివారం జరగాల్సిన అధికారుల సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఏపీలో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం

Related Posts