ఉండవల్లి సమీపంలోని కృష్ణా కరకట్ట లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సీఆర్డీఏ అధికారులు శనివారం మరో 10 మందికి నోటీసులు జారీ చేశారు. తాజాగా శనివారం తులసీ గార్డెన్స్, లింగమనేని రమేష్, చందన బ్రదర్స్, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పాతూరి సుధారాణి, శైవక్షేత్రంలోని ఆరుగురికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణానది నుంచి కరకట్టకు మధ్యలో ఉన్న భవనాలన్నింటికీ నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అక్రమ నిర్మాణమంటూ ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసి, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్‌కు సైతం రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే