YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత్‌కు ఓటమి రుచి చూపిన ఆతిథ్య జట్టు..!!

భారత్‌కు ఓటమి రుచి చూపిన ఆతిథ్య జట్టు..!!

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

కోహ్లీసేనకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం భారత్‌ 31 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జానీ బెయిర్‌స్టో (111; 109 బంతుల్లో 10×4, 6×6), బెన్‌ స్టోక్స్‌ (79; 54 బంతుల్లో 6×4, 3×6), జేసన్‌ రాయ్‌ (66; 57 బంతుల్లో 7×4, 2×6) మెరుపులతో ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. షమి (5/69), బుమ్రా (1/44) మినహా భారత బౌలర్లు విఫలమయ్యారు. అనంతరం టీమ్‌ఇండియా 5 వికెట్లకు 306 పరుగులే చేయగలిగింది. రోహిత్‌ శర్మ (102; 109 బంతుల్లో 15×4) సెంచరీ వృథా అయింది. కోహ్లి (66; 76 బంతుల్లో 7×4), పాండ్య (45; 33 బంతుల్లో 4×4)ల పోరాటం సరిపోలేదు. ప్లంకెట్‌ (3/55), వోక్స్‌ (2/58) భారత్‌ను దెబ్బ తీశారు. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా వరుసగా అయిదు విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

Related Posts