YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రసవత్తరంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు

రసవత్తరంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఉండరు. కానీ అవసరాలే అలా బంధాలను కలుపుతాయి. కొన్నిసార్లు అవసరం కంటే కూడా అహంకారం, ఆధిపత్యం డామినేట్ చేస్తాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స‌రికొత్త రికార్డ్ న‌మోద‌వుతోంది. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీలు రాజ‌కీయంగా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఒకే గూటి పక్షులైతే ఇగోలతో కధ మొత్తం అడ్డం తిరుగుతుంది. నిన్నటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కధ ఇదే. చంద్రబాబుకు రాజకీయ శిష్యుడు కేసీయార్. అప్పట్లో వెన్నుపోటు ఎపిసోడ్ తరువాత బాబు కేసీయార్ ని బాగా చూసుకుని క్యాబినేట్లో మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఆ తరువాత 1999 నాటికి సీన్ రివర్స్ అయింది. కేసీయార్ ని డిప్యూటీ స్పీకర్ ని మాత్రం చేసి మంత్రి పదవి ఎగ్గొట్టారు. దాంతో తనని తక్కువ చేశారన్న ఆవేదనతో కేసీయార్ బయటకు వచ్చేశారు. తరువాత తెలంగాణా ఉద్యమ కధ అందరికీ తెలిసిందే.అలా బాబుని కాదని వచ్చిన వారు ఎవరూ ఆ రోజుల్లో మనలేకపోయారు. కేసీయార్ మాత్రం బాబుని సీఎం సీటు నుంచి దించేయగలిగారు. మళ్ళీ ఉమ్మడి ఏపీలో బాబు సీఎం కాలేకపోయారు. ఇక కేసీయార్ మాత్రం తాను కోరుకున్న తెలంగాణాను తెచ్చుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అంతే కాదు, రెండవమారు కూడా గొప్పగా గెలిచారు. ఇక బాబుతో ఎపుడూ కేసీయార్ కి మంచి సంబంధాలు లేవు. బాబుకు తనని కేసీయార్ దెబ్బ కొట్టారని ఆక్రోశం. కేసీయార్ కి బాబు గురించి అంతా తెలుసు కాబట్టి దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందో అన్న అనుమానం, ఇవన్నీ కలసి ఈ ఇద్దరు సీఎంలు అయిదేళ్ళ పాటు బద్ద శత్రువులుగానే బతికారు.ఇక ఉమ్మడి ఏపీలో జల వివాదాల మీద పూర్తి అవగాహన కేసీయార్ కి ఉంది. జగన్ సైతం చొరవ చూపిస్తున్నారు. ఇద్దరు సీఎంలు కలసి రెండు రాష్ట్రాలకు మంచి చేసేందుకు ప్రగతి శీల ప్రతిపాదనలు చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఇపుడున్న వాతావరణంలో ఏపీ చాలా ఇబ్బందులో ఉంది. విభజన తరువాత సంపన్న రాష్ట్రమైన తెలంగాణ అండ ఉండడం ఏపీకి అవసరం, అలాగే కేసీయార్ లాంటి రాజకీయ అనుభవం ఉన్న నాయకుని మద్దతు జగన్ కి కూడా అవసరం. ఈ ఇద్దరు మిత్రులు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశానికే కొత్త స్పూర్తిని ఇస్తారని అంతా ఆశిస్తున్నా నిజానికి ప‌క్క‌ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, రాజ‌కీయ ప‌రిణామాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. అయితే, ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో మాత్రం రాజ‌కీయ ప‌రిణామాలు గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చూసిన‌ప్పుడు చాలా వ‌ర‌కు మారిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల్లో క‌ల‌సి ముందుకు సాగుతామ‌నే విధంగా రాజ‌కీయాలు నెల‌కొన్నాయి. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్ప‌టికి ఐదు సార్లు భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా రాష్ట్ర ప‌రిస్థితుల‌ను చూసినా.. రికార్డుగానే భావించాల్సి ఉంటుంది.ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి నెల రోజులు కూడా కాకుండానే వ‌రుస భేటీలు కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ సంచ‌ల‌నంగా మారింది. నిజానికి రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు అలానే ఉండిపోయాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి ఆస్తుల‌కు సంబంధించిన లెక్క‌లు, విద్యుత్ బ‌కాయిలు, నీటి పంప‌కాలు వంటివి చాలా వ‌ర‌కు అప‌రిష్కృతంగా ఉండిపోయాయి. దీనికి సంబంధించి చ‌ట్టంలో పేర్కొన్న విధంగా కూడా అడుగులు ముందుకు ప‌డ‌లేదు. కేంద్రం నుంచి స‌హ‌కారం అందే విష‌యంలో తెలంగాణ నుంచి అభ్యంత‌రం వెలువ‌డితే.. ఏపీ ముందుకు వెళ్ల‌ద‌నే విష‌యం ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తెలంగాణ విష‌యంలో ఏపీ స‌ఖ్య‌త‌గా ఉండాల‌నే ప్ర‌తి ఒక్క‌రూ కొరుతున్నారు.అయితే, గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న నేప‌థ్యంలో అటు కేసీఆర్‌, ఇటు చంద్ర‌బాబు ఇద్ద‌రూ కూడా పంతాల‌కు పోయి, రాజ‌కీయాల‌ను వివాదాల్లోకి నెట్టారు. ఫ‌లితంగా ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు వీరిద్ద‌రు క‌లుసుకుంటేనే గొప్ప వార్త అన్న‌ట్టుగా ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాల సంబంధాల విష‌యంలో చాలా మ‌ర్పులు వ‌చ్చాయి.అయితే, తాజాగా రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాటు, తెలంగాణ‌లో కేసీఆర్ ఏపీతో పొత్తుకు ముందుకు రావ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌పై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా న‌దీజ‌లాల విష‌యంలో జ‌గ‌న్, కేసీఆర్ ఆలోచ‌న‌లు ఒక్క‌టిగా క‌లిస్తే గొప్ప విష‌య‌మే అవుతుంది. ఇక జగన్ ఏపీ సీఎం అయ్యాక కేసీయార్ ఏపీ తరచూ వస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారంతో పాటు ఒకటి రెండు సార్లు ఏపీ టూర్లు వేశారు. ఇక జగన్ ప్రగతిభవన్లోకి ఇప్పటికి రెండు సార్లు వెళ్లారు. తాజాగా నీటి పంపకాలు, ఇతర విభజన సమస్యల మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. కలసి ఒకటిగా సాగాలని నిర్ణయించుకున్నారు. నిజంగా ఇద్దరు మంచి మిత్రులు అయిపోయారని అంతా అనుకుంటున్నారు. ఈ బంధం కలవడం వెనక రాజకీయ అవసరాలతో పాటు ఒకరి మీద మరొకరికి నమ్మకం గట్టిగా ఉంది. వయసులో తండ్రి సమానుడైన కేసీయార్ ని జగన్ నమ్ముతున్నారు. అదే విధంగా కేసీయార్ సైతం జగన్ మాట మీద నిలబడే తత్వాన్ని విశ్వసిస్తున్నారుఈ బంధం మ‌రింత బ‌ల‌ప‌డితే.. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కీల‌కం అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి

Related Posts