ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ మావోయిస్టులు తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే ఛత్తీస్ గడ్ సుకుమా జిల్లా డోర్నపాల్ పరిధిలో కుత్తి గ్రామం వద్ద హైద్రాబాద్ నుండి జగదల్ పూర్ వెళ్తున్న తెలంగాణ ఆర్. టీ.సి బస్ ను మావోయిస్టులు తగులబెట్టారు. బస్సులో ఉన్నప్రయాణికులను కిందకిదింపేసి మరీ ఈ చర్యకు పాల్పాడ్డారు. దీనితో ప్రయాణికులు సి.ఆర్. పి.ఎఫ్.కాంప్ కు చేరుకున్నారు.మరో ప్రైవేట్ బస్ ను, ట్రాక్టర్ ను కూడా మావోయిస్టులు తగలపెట్టారు.