YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ను పట్టించుకోని టాలీవుడ్

 జగన్ ను పట్టించుకోని టాలీవుడ్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

వైఎస్ జగన్ ఏపీ సీఎం అయి నెల రోజులు దాటిపోయాయి. ఆయన బంపర్ మెజార్టీతో గెలిచారు. చరిత్రలో ఎవరూ సాధించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. దేశమంతా ఆచ్చెరువందేలా తెలుగు ఠీవి ఇదీ అని చూపించారు. మరి జగన్ విషయంలో అందరూ స్పందించినా టాలీవుడ్ ఎందుకు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోంది. టాలీవుడ్ దిగ్గజాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి. జగన్ అంటే లెక్కలేనట్లుగా ఎందుకు దూరం పెడుతున్నాయి. ఇది అందరిలోనూ కలుగుతున్న సందేహాలు. ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి. నిజానికి కొత్తగా ఎవరు గెలిచినా కూడా వారిని అభినందించి సత్కరించడం టాలీవుడ్ కి ఉన్న అనవాయితీ. కేసీయార్ గెలవగానే వెల్లువలా అభినందన‌లు చెప్పి ఉప్పొగించిన టాలీవుడ్ జగన్ విషయంలో మాత్రం వేరుగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.టాలీవుడ్లో ఇపుడు నడుస్తోంది మెగా అధిపత్యం. చిరంజీవి కుటుంబం నుంచి డజన్ మంది వరకూ హీరోలు వెండితెరను ఏలుతున్నారు. ఇక వారి సినిమాలు టాలివుడ్లో అధిక భాగం ఆదాయాన్ని తెస్తాయి. వారితో పెట్టుకుంటే ఎంతటివారికైనా ఇంతే సంగతులు. పైగా మెగా కుటుంబం నుంచి ఈసారి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ రంగంలో ఉన్నారు. ఆయన పార్టీ బాగా సీట్లు గెలుచుకుని నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందని అంతా భావించారు. ఇక మెగా కుటుంబం మొత్తం పవన్ వెంట నిలిచింది. అయితే ఆయన దారుణంగా ఓడిపోయారు పైగా ఆయన పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమిపాలు అయ్యారు. ఈ పరిణామం టాలీవుడ్ ని ఉలికిపాటుకు గురి చేసింది. ఇక మెగా కుటుంబం పరాజయ బాధలో ఉంటే జగన్ని పొగిడితే ఎక్కడ చెడుతామోనని బెంగతో చాలామంది హీరోలు లౌక్యంగా వైఎస్ జగన్ విషయంలో మౌనం దాల్చారని అంటున్నారు.ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ లేదు. హైదరాబాదే దానికి కేంద్రం. ఇక్కడ కేసీయర్ ని పొగుడుకుంటే సరిపోతుంది. ఇప్పట్లో అటువైపు పరిశ్రమ వెళ్ళే అవకాశాలు అంతకంటే లేవు. ఒకవేళ జగన్ సినిమా రంగానికి సంబంధించి పాల‌సీని ప్రకటిస్తే అపుడు స్టూడియోలు స్థలాల కోసం ఎవరైనా ఆ వైపు చూస్తారు, అంతే తప్ప ఇప్పట్లో మాత్రం కాదు. ఏది ఏమైనా వైఎస్ జగన్ విషయంలో మాత్రం టాలీవుడ్ వ్యూహాత్మకమైన మౌనాన్ని పాటిస్తోంది. దీని మీద టాలీవుడ్ పెద్ద తలకాయల్లో ఒకరైన నిర్మాత సురేష్ బాబు తాము జగన్ని సరైన సమయంలో కలుస్తామని చెప్పుకొచ్చారు. చూడాలి ఆ సమయం ఎపుడు వస్తుందో.

Related Posts