యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్ల జిల్లా అని పేరు. ఎపుడో 1950 దశకంలో లక్ష్మె నరసిమ్హ దొర తొలి స్పీకర్ అయ్యారు. ఆ తరువాత ముప్పయ్యేళ్ళకు 1983 లో అన్న నందమూరి ప్రభుత్వంలో ఇదే జిల్లాకు చెందిన తంగి సత్యనారయణ స్పీకర్ అయ్యారు. నాదెండ్ల ఎపిసోడ్ లో తంగి అటువైపు పోవడంతో మళ్ళీ ఈ జిల్లాకు స్పీకర్ పదవి దక్కేసరికి 1999 వచ్చేసింది. ప్రతిభాభారతి స్పీకర్ గా బాబు టైంలో పనిచేశారు. ఇక లేటెస్ట్ గా తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నారు. తమ్మినేని సీనియర్ మోస్ట్ లీడర్. ఏపీ అసెంబ్లీలో బాబు తరువాత వరసలో ఆయనే సీనియర్. ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత. పలుమార్లు మంత్రి పదవిని నిర్వహించిన తమ్మినేనికి ఈసారి కూడా మంత్రి పదవి కావాలనుకున్నారు. కానీ స్పీకర్ పదవి వచ్చింది. దాంతో తన అనుభవాన్ని అంతా రంగరించి స్పీకర్ అ పదవికి విలువను తీసుకురావాలనుకుంటున్నారు.ఇక సాధారణంగా రాజ్యంగబద్దమైన పదవుల్లో ఉన్న వారు క్రియాశీలకంగా ఉండరు. తమ్మినేని సీతారాం సైతం మళ్ళీ పోటీ చేసే ఆలోచనలో ఎటూ లేరు. దాంతో ఆయన స్పీకర్ ఆఫీస్ లో హుందాగా ఉంటే చాలు. కానీ తమ్మినేని మాత్రం తాను జనంలోనే ఉంటానని అంటున్నారు. తన నియోజకవర్గంతో పాటు, శ్రీకాకుళం జిల్లా అభివ్రుధ్ధి కోసం స్పీకర్ గా తన వంతు పాత్ర పోషిస్తానని చెబుతున్నారు. అందుకే ఆయన జిల్లాకు వచ్చీ రాగానే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా సమస్యలపై వారికి దిశా నిర్దేశం చేశారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కంటే కూడా ఆయన ముందుంటున్నారు. దీంతో వర్గ పోరు సంగతేమో కానీ తమ్మినేని జోరు మాత్రం ఎక్కువగా ఉందని అంటున్నారు.ఇక శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన క్రిష్ణ దాస్ ఏకైక మంత్రి. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చురుకుగా ఉండడంతో ఇద్దరు మంత్రులు ఉన్నట్లైంది. తమ్మినేని సైతం అధికారులని పిలిపించుకుని సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతే కాదు తన వద్దకు వచ్చే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు హామీలు ఇస్తూ తాను అన్ని శాఖల మంత్రులను పిలిపించుకుని సమస్యలు పరిష్కారం చేస్తానని చెబుతున్నారు. మొత్తానికి తమ్మినేని సీతారాం రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ గేరప్ అయ్యారని, తన సత్తా చాటుతున్నారని అంటున్నారు. తమ్మినేని రాజకీయం వల్ల వైసీపీకి కూడా లాభమే అంటున్నారు. బలమైన కళింగ కులానికి చెందిన ఆయన చురుకుగా ఉంటే అది పార్టీకి ప్లస్ అవుతుందంటున్నారు.