యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ప్రపంచకప్ లో భారత్ ను గాయాలు వదలడం లేదు. భారత్ ఓపెనర్ ధావన్ బ్రోటకన వేళ్ళు గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. తాజాగా గాయం కారణంగా టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ తప్పుకొన్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. ప్రాక్టీస్ సెషన్లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తుండగా విజయ్‌శంకర్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అతడు ప్రపంచకప్‌లో కొనసాగడం కష్టంగా ఉందని, స్వదేశానికి తిరిగొస్తాడని అధికారి తెలిపారు. అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను టీమిండియా యాజమాన్యం ఎంపిక చేసిందని అన్నారు.