YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముంబైని ముంచెత్తిన వానలు

ముంబైని ముంచెత్తిన వానలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

భారీ వర్షాలు, వరదలతో మహారాష్ట్ర రాజధాని ముంబయి మహానగరం అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో నీట మునిగాయి. కొన్ని ఏరియాల్లో 3-4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కుర్లా ప్రాంతంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నారు. అంధేరి సబ్‌వే ప్రాంతంలోనూ వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నగరంలోని చాలా ప్రాంతాలు ప్రస్తుతం నీటి ముంపులోనే ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముంబయిలోని సియాన్ రైల్వేస్టేషన్‌లో వరద నీరు ప్లాట్‌ఫామ్‌కు సమాంతరంగా చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిలిచిపోవడంతో జామ్రంగ్‌‌- ఠాకూర్వాడీ మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో అటువైపుగా వెళ్లే 10 రైళ్లను రద్దు అధికారులు చేశారు. మరికొన్ని రైళ్లను కల్యాణ్‌- ఇగాట్‌పురి వైపు మళ్లించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఆదివారం రాత్రి భారీ వర్షం కురవడంతో ముంబయి వాసుల కష్టాలు మరింత పెరిగాయి. ముంబయిలో గడిచిన 24 గంటల్లో 93మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్కైమెట్ సంస్థ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

Related Posts