YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత్ ను ఉతికి ఆరేస్తున్న నెట్ జన్లు

భారత్ ను ఉతికి ఆరేస్తున్న నెట్ జన్లు

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:  

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో తొలి పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టుపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో 338 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. ఆఖరికి 306/5కే పరిమితమైంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (102: 109 బంతుల్లో 15x4), కెప్టెన్ విరాట్ కోహ్లి (66: 76 బంతుల్లో 7x4) దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో గెలిచేలా కనిపించిన భారత్ జట్టు.. స్లాగ్ ఓవర్లలో మహేంద్రసింగ్ ధోని (42: 31 బంతుల్లో 4x4, 1x6), కేదార్ జాదవ్ (12: 13 బంతుల్లో 1x4) పేలవ బ్యాటింగ్ కారణంగా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో.. ధోనీ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (111: 109 బంతుల్లో 10x4, 6x6) సెంచరీ బాదడంతో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో.. భారత బౌలర్లపై ఆఖరి వరకూ ఎదురుదాడిని కొనసాగించారు. ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో బెన్‌స్టోక్స్ (79: 54 బంతుల్లో 6x4, 3x6) విలువైన పరుగులు చేశాడు. ఛేదనలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్య (45: 33 బంతుల్లో 4x4), రిషబ్ పంత్ (32: 29 బంతుల్లో 4x4) దూకుడు పెంచి భారత్ శిబిరంలో గెలుపు ఆశలు కొనసాగించారు. కానీ.. ధోనీ, జాదవ్ జోడీ.. చివర్లో పరుగులు, బంతుల మధ్య అంతరం పెరుగుతున్నా.. సింగిల్స్‌, డిఫెన్స్‌తో సరిపెట్టి మ్యాచ్‌లో గెలుపు అవకాశాల్ని దూరం చేశారు.

Related Posts