యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
టెలికం కంపెనీ వొడాఫోన్ తన యూజర్లకు తీపికబురు అందించింది. రిలయన్స్ జియో సహా ఇతర టెలికం సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ కారణంగా కంపెనీ తన రీచార్జ్ ప్లాన్లను సవరించింది. వొడాఫోన్ తాజాగా రూ.129 ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులు అన్ని సర్కిళ్లలోని యూజర్లకూ వర్తిస్తాయి. కస్టమర్లకు ఇదివరకు ఈ ప్లాన్ కింద రూ.1.5 జీబీ డేటా పొందేవారు. ఇప్పుడు వీరికి 2 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. Vodafone 129 Planలో డేటాతోపాటు అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ప్లాన్ వాలిడిటీ కాలంలో 300 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. తక్కువ డేటా, ఎక్కువ కాల్స్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. ఇకపోతే వొడాఫోన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.129 ప్రిపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. తొలిగా 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో ఈ ప్లాన్ తీసుకువచ్చింది. తర్వాత ఎస్ఎంఎస్ ప్రయోజనాన్ని యాడ్ చేసింది. ఇప్పుడు 500 ఎంబీ అదనపు డేటా అందిస్తోంది. Airtel 129 Plan పోటీగా కంపెనీ తన ప్లాన్‌ను సవరిచింది.