YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చిన్నారులను లైంగికంగా వేధిస్తే.... అది కట్

చిన్నారులను లైంగికంగా  వేధిస్తే.... అది కట్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇటీవల చిన్నారులపై ఆకృత్యాలు మితిమీరుతున్న సంగతి తెలిసిందే. అభం శుభం తెలియని చిన్నారులను ఎత్తుకుపోయి దారుణంగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ప్రాణాలు తీస్తున్న రాక్షసులను ఎన్‌కౌంటర్ చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని అలబామా 13 ఏళ్ల లోపు చిన్నారులను లైంగిక వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు HB 379 బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి జైలు శిక్ష విధిస్తారు. శిక్ష పూర్తయిన తర్వాత వారిని పూర్తి నపుంసకులుగా మార్చి జైలు నుంచి విడుదల చేస్తారు. ఇందుకు అంగీకరించనివారిని జైల్లోనే ఉంచుతారు. పెరోల్, బెయిల్ వంటివి ఏవీ ఆమోదించరు. రిపబ్లికన్ స్టేట్ ప్రతినిధి స్టీవ్ హర్స్ట్ మొట్టమొదటిగా ఈ చట్టాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి నేరగాళ్ల వల్ల చిన్నారులు జీవితాన్నే కోల్పుతున్నారు. ఈ నేపథ్యంలో దోషులకు విధించే శిక్ష అందుకు సమానంగా ఉండాలి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రోజు చాలామంది ఇది అమానవీయం అన్నారు. అయితే, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటం కంటే అమానవీయం ఏముందని ప్రశ్నించా. దీన్ని ఎవరైనా అమానవీయం అని అంటే అంతకుమించి అమానవీయత మరొకటి ఉండదు’’ అన్నారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అలబామాకు చెందిన రైమాండ్ జాన్సన్ అనే న్యాయవాది వ్యతిరేకించారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి ప్రస్తుతం విధిస్తున్న శిక్షలు సరిపోతాయని, ఇందుకు కొత్త చట్టం అవసరం లేదని వాదిస్తున్నారు. ఈ విషయాన్ని తాను రాజ్యాంగంలోని 8వ సవరణ కింద ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఇది చాలా క్రూరమైన, అమానవీయ శిక్ష అన్నారు. చేసిన నేరానికి శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఆ నేరగాడు జీవితాంతం నపుంసకుడిగా జీవించాల్సి వస్తుందని జాన్సన్ అంటున్నారు.

Related Posts