హీరో మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించి నాన్ బాహుబలి రికార్డును 50 రోజుల్లో 211 సెంటర్స్, వసూళ్ళలో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించిన సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు వహాబ్ ఆద్వర్యంలో స్థానిక శివప్రియ థియేటర్ లో 50 డేస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా రైతు పాత్రలో అలరించిన నటుడు గురుస్వామి, నరవ రమాకాంత్ రెడ్డి లు కలిసి ముందుగా కృష్ణ గారి సతీమణి విజయనిర్మల చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం 50డేస్ కేకును కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు.నటుడు గురుస్వామిని అభిమానులు శాలువా కప్పి మెమెంటోతో ఘనంగా సత్కరించారు. సమాజంలో పదిమందికి స్పూర్తిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫ్యాన్స్ అధ్యక్షుడు వహాబ్ ను కూడ అతిథులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ మహేష్ బాబు తో కలిసి నటించడం తన అదృష్టమని,ఈ చిత్రంలో నటించడంతో మరో రెండు మూడు చిత్రాలకు నటించే అవకాశం దక్కిందన్నారు. చిత్రంలోని ఓ సన్నివేశంలో పాదరక్షాలు లేకుండా నడిచే సమయంలో పాదరక్షాలు ఆయనకు తొడుగించాలని కోరారు మహేష్ నిజంగా ఆయన మనసు గొప్ప మహర్షి అని అభివర్ణించారు.
రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు పాత్రలో గురుస్వామి నటించిన తీరు,ఆయన రైతుల గురించి చెప్పిన డైలాగ్ సినిమా స్థాయిని పెంచాయన్నారు.
కార్యక్రమంలో కృష్ణమూర్తి, ఆనంద్,ఎం.ఎస్.వాసు,శ్రీనివాసులు,ధను,శ్యామ్,బసవరాజు,జస్వంత్,గిరీష్,రాజు,వెంకటేష్,రెహ్మాన్,కృష్ణారెడ్డి,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.