స్పందన గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టరు జి. వీరపాండియన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందర కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టిదల దరఖాస్తుదారుల విన్నపాలను పరాష్కరించాలన్నారు. ఆ రోజు దాదాపు 300 దరఖాస్తులు అందాయని వీటిలో ఎక్కువగా భూసమస్యలు, పాఠశాల అడ్మిషన్. తదితర సమస్యల కొరకు దరఖాస్తులు సమర్పించారన్నారు. సంబంధిత అధికారులు వీటిని పరిష్కరించాలన్నారు. సియం కార్యలయం నుండి ఆన్ లైన్ ద్వారా జిల్లాకు చెందిన 24 ఫిర్యాదులు అందాయని వీటిని అధిక ప్రాధ్యానత నిచ్చి పరిష్కరించాలన్నారు. నెల కొకసారి ఎస్. గ్రీవెన్స్ ను అలాగే ఔట్ సోర్సింగ్ వారికి సంబంధిచిన గ్రీవెన్స్ ను నిర్వహిస్తామన్నారు. మండల స్థాయిలో సివిల్ రైట్స్ కు సంబంధించిన గ్కీవెన్స్ ను సంబంధిత అధికారులు ఏర్పాటు చేయీలన్నారు. ఈ క్రార్యక్రమంలో జేసి రవిపటాన్ శెట్టి,జేసి-2 మణిమాల, డిఆర్ ఓ వెంకటేశం, జేడ్పి సిఇఓ విశ్వేశ్వరనాయుడు, డిఆర్డిఎ పిడి రామకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.